రోడ్డు విస్తీర్ణ పనులు వెంటనే చేపట్టాలి ** డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ **

Published: Thursday February 16, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 15 (ప్రజాపాలన,ప్రతినిధి) : 
 ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ కోసం జిల్లాలు ఏర్పడిన తర్వాత విస్తరణ చేయాలని అధికారులు సర్వేలు చేపట్టి రోడ్డుకు ఇరువైపులా 66 ఫీట్ల వెడల్పుతో కొమరం భీమ్ చౌక్ నుంచి చెక్ పోస్ట్ కొరకు విస్తీర్ణ పనులు చేపట్టేందుకు మార్కింగ్ సైతం చేశారని వెంటనే విస్తీర్ణ పనులు చేపట్టాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గోడిసెల కార్తీక్ ఉన్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో కార్తీక్ మాట్లాడుతూ మేజర్ గ్రామపంచాయతీ గా ఉన్న ఆసిఫాబాద్ పట్టణాన్ని ప్రభుత్వం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిందని, జిల్లా ఆవిర్భవించిన అప్పటినుంచి రద్దీ ఎక్కువ కావడం వలన రోడ్డు లో వాహనాల సంఖ్య పెరగడంతో అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. దానికి తోడు హైదరాబాదు నుంచి నాగపూర్ రహదారి కావడంతో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు నడుస్తున్నాయన్నారు. అటవీశాఖ చెక్ పోస్ట్ నుంచి కొమరం భీమ్ వరకు రూరల్ నిధులతో డివైడర్లు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారని, ఇరువైపులా రోడ్డుకు విస్తీర్ణ తక్కువ ఉండడం వల్ల వాహనాలకు, ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, రోడ్డు విస్తరణ ఇరువైపులా పెంచినప్పటికీ ఒకపక్క మాత్రం అధిక మొత్తంలో వెడల్పు తీయడం ఇంకోపక్క అదే విధంగా ఉండడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇది అధికారుల దృష్టిలో ఉన్నప్పటికీ "కొంతమంది బడా వ్యాపారుల ఒత్తిడి వలన" ఆ విస్తీర్ణం అనేది పెంచడం లేదన్నారు. వెంటనే ఇరువైపులా విస్తీర్ణ పెంచి ప్రమాదాలు జరగకుండా చూడాలని, సెంట్రల్ లైటింగ్ ని అమలు చేయాలని, డివైఎఫ్ఐ కొమరం భీం జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో ఆందోళనలు చేయాల్సి వస్తుందని ప్రజాప్రతినిధులు అధికారులు వెంటనే స్పందించి అటవీ శాఖ చెక్పోస్ట్ నుంచి కుమరం భీమ్ చౌక్ వరకు ఇరువైపులా 66 ఫీట్ల వెడల్పు ను పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దుర్గం నిఖిల్, మాల శ్రీ, రవీందర్ పాల్గొన్నారు.