ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 18ప్రజాపాలన ప్రతినిధి *ఎస్టీయూ వజ్రోత్సవ సంబురాల గొడపత్రిక ఆవిష్

Published: Monday December 19, 2022
ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఉపాధ్యాయుల సమస్యల సాధనే ఊపిరిగా పూరుడు పోసుకున్న రాష్ట్రోపాధ్యాయ సంఘం 75 వసంతాలు పూర్తిచేసుకుని వజ్రోత్సవ సంబురాలు జరుపుకోవడం శుభపరిణామమని గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణా రెడ్డి అన్నారు. ఆదివారం తన నివాసంలో ఎస్టీయూ వజ్రోత్సవ వేడుకల పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల హక్కుల సాధనకు ఒక పక్క, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు మరోపక్క పాటుపడుతన్న సంఘం ఎస్టీయూనే అన్నారు. వృత్తిని దైవంగా భావించే నిబద్దత గల కార్యకర్తలు గల సంఘం దేశ స్వాతత్య్రానికి ముందే పురుడు పోసుకున్నదని వారు గుర్తుచేశారు. ఇప్పుడున్న అన్ని సంఘాలకు మాతృ సంఘం ఎస్టీయూ నే అన్నారు. రాష్ట్ర వజ్రోత్సవ వేడుకలను ఈ నెల 24,25 వ తేదీలలో యం. ఇ రెడ్డి గార్డెన్స్, సుష్మా థియేటర్ సర్కిల్ వనస్థలిపురం లో నిర్వహించడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి  జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఎ ఐ ఎస్ టి ఎఫ్  భాద్యులు బ్రహ్మచారి, పరమేష, పురుషోత్తంరెడ్డి, భాస్కర్, జిల్లా నాయకులు పాండురంగారెడ్డి, శ్రీనివాసరావు, బాల మల్లేష్, శ్రీనివాస్, వెంకటయ్య, అశోక్, బాలకృష్ణ, నవీన్, మహేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.