రామాయణ మహా గ్రంధాన్ని అందించిన మహోన్నత వ్యక్తి మహర్షి వాల్మీకి జిల్లా అదనపు కలెక్టర్ మధుసూ

Published: Tuesday October 11, 2022
మంచిర్యాల బ్యూరో, అక్టోబర్ 9, ప్రజాపాలన :
రామాయణం మహా గ్రంధాన్ని రచించి మనకు అందించిన మహోన్నత వ్యక్తి మహర్షి వాల్మీకి అని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. ఆదివారం మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బడుగు వర్గాలకు చెందిన వాల్మీకి రామాయణం మహా గ్రంథాన్ని రచించి ఆదికవిగా పేరుగాంచారని అన్నారు. సామాన్యుడు తలుచుకుంటే  చేయలేనిది ఏదీ లేదని నిరూపించారని తెలిపారు. వాల్మీకి స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని, అభివృద్ధి చెందాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.