రైతులకు వ్యవసాయనికి 24గంటలు సరఫరా చేసే విద్యుత్ కు పెట్టిన కోతలు ఎత్తివేయాలి వైయస్సార్ తెలంగ

Published: Saturday July 02, 2022

ఇబ్రహీంపట్నం.లో వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్యగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ రైతులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిరంతరం వ్యవసాయనికి 24గంటలు ఉచిత కరెంట్ సరఫరా చేస్తాం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం అని మాయ మాటలు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ క్రమ క్రమంగా రైతులకు కరెంట్ కోతలు విధిస్తు 24గంటలు సరఫరా చేసే కరెంట్ ఏకంగా15గంటలు కోతలు పెడుతూ 9గంటలు మాత్రమే కరెంట్ సరఫరా చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీడియాలో మాత్రం రైతులకు 24గంటలు ఉచిత కరెంట్ సరఫరా చేస్తున్నాం అని రాష్ట్ర మంత్రులు అధికారి పార్టీ నాయకులు చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు 24గంటలు కరెంట్ ఉంటది కేసీఆర్ మాట తప్పడు అని రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నమ్మి రైతులు వరి పంటలు పండించే పొలాలు పూర్తి స్థాయిలో సాగు చేసి వారి పంట వేసు కోవటానికి.సిద్ధం చేసుకున్నారు. సిద్ధంగా ఉన్న పొలాలకు కరెంట్ కోతలతో సాగు నీరు సక్రమంగా అందక పోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు 24గంటలు కరెంట్ ఉంటది నమ్మి వరి పంటలు వేసుకోవడానికి పూర్తి స్థాయిలో సాగు చేసుకున్నాం ఏకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం15గంటలు కరెంట్ కోతలు విధించటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో బిక్కు బిక్కుమంటున్నారు వేరే పంటలు సాగు చేసుకుందాం అంటే సమయానికి వర్షాలు కురవడం లేదు ఒక రైతు బంధు పథకంతో రైతులను నమ్మించి రైతులకు అందే అన్ని సబ్సిడీ పథకాలను దూరం చేసిన గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తా అని ఇప్పట్టికి చేయక పాయే      వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు వ్యవసాయ నికి సరఫరా చేసే విద్యుత్ కు పెట్టిన కోతలు వెంటనే ఎత్తువేయాలి రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం24గంటలు  ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం ఉచిత విద్యుత్ సరఫరా చేయాలి పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రం లో చలో అసెంబ్లీ అంటూ మరో కరెంట్ ఉద్యమం జరుగుతుంది అని హెచ్చరిస్తున్నాం