మంత్రి స్థాయి దిగజారి మాట్లాడొద్దు

Published: Wednesday February 15, 2023
* వికారాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కమాల్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 14 ఫిబ్రవరి ప్రజాపాలన : మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ తన స్థాయి దిగజారి మాట్లాడడం ఎమ్మెల్యే ఆనంద్ భయం పట్టుకుందని వికారాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారెగూడెం కమాల్ రెడ్డి అన్నారు. మంగళవారం బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని పులుమద్ది గ్రామ సర్పంచ్ తిమ్మాపురం మాధవరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ప్రసాద్ కుమార్ దిగజారుడు మాటలు మాట్లాడొద్దని హెచ్చరించారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అనునిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నాడని స్పష్టం చేశారు. ఉన్నత విద్యావంతుడు రాజకీయ పరిపక్వత గల వ్యక్తి ఎమ్మెల్యే ఆనంద్ ను వాడు వీడు అని సంబోధించడం మంత్రి స్థాయిని మరిచాడన్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 300 ఎకరాల భూమిని సంపాదించినట్లైతే, ఆ భూమి మొత్తాన్ని ప్రసాద్ కుమార్ తీసుకొని ప్రసాద్ కుమార్ సంపాదించిన ఆస్తులను మా ఎమ్మెల్యేకు ఇస్తారా అని సవాల్ చేశారు. గ్రామాలకు ఎమ్మెల్యే ఒక్కసారి అయినా వచ్చిన పాపాన పోలేదు అనడం మంత్రి స్థాయి అవివేకానికి గుర్తుగా నిలుస్తుంది అన్నారు. పులుమద్ది గ్రామ సర్పంచ్ తిమ్మాపురం మాధవరెడ్డి మాట్లాడుతూ మా గ్రామానికి వికారాబాద్ ఎమ్మెల్యే 8 సార్లు అధికారికంగా 4 సార్లు అనధికారంగా వచ్చారన్నారు. ఎమ్మెల్యే పై దిగజారుడు మాటలు మాట్లాడి ఓట్లు సంపాదించుకోవచ్చు అని ఆశపడుతుండడం అత్యాశ అవుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ గాయాజ్ మైలార్ దేవరంపల్లి సర్పంచ్ ఆలంపల్లి తిరుపతిరెడ్డి దాచారం గ్రామ సర్పంచ్ ఎల్లన్నోళ్ల అంజయ్య బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎర్రవల్లి రవీందర్ ఎర్రవల్లి గఫార్ పులుమద్ది భాస్కర్ పులుమద్ది శ్రీశైలం వికారాబాద్ మండల సోషల్ మీడియా ఇంచార్జ్ బురాన్ పల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు.