రక్షణ కవచంలా వ్యాక్సిన్ - సంజయ్ కుమార్

Published: Saturday May 29, 2021
జగిత్యాల, మే 28 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్పైడర్స్ గా గుర్తించి వ్యాక్సినేషన్ ఇస్తున్న సందర్భంగా వ్యాక్సినేషన్ కొనసాగుతున్న తీరును స్థానిక ఎమ్మెల్యే డా.సంజాయ్ కుమార్ జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ తో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యాక్సిన్ అనేది మనిషికి రక్షణ కవచంలా పని చేస్తోందని కరోనా నుంచి బయట పడాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని అన్నారు. వ్యాక్సిన్ పై గతంలో ఎన్నో అపోహలు సృష్టించారని వదంతులు నమ్మవద్దని కోరారు. నిత్యం ప్రజలతో మమేకం అవుతున్న వారిని గుర్తించి టీకా అందించడం హర్షణీయమని అన్నారు. కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరిస్తోందని రానున్న రోజుల్లో అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు అందరూ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు.