రాజగోపాల్ రెడ్డి జన్మదిన సందర్భంగా నిత్యావసర సరుకుల పంపిణీ

Published: Wednesday June 02, 2021
యాదాద్రి, భువనగిరి జిల్లా ప్రజాపాలన ప్రతినిధి : ఎన్ని అడ్డంకులు ఎదురైనా నమ్మిన ప్రజల కోసం అండగా ఉండే రాజన్న మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలో మాజీ భువనగిరి ప్రథమ పార్లమెంట్ సభ్యులు పేదల పెన్నిధి ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి 54వ జన్మదినం సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ ఆధ్వర్యంలో అనాజిపురం గ్రామంలో కరోనా వైరస్ సోకిన వ్యక్తుల కుటుంబాలకు, ఆశ వర్కర్లకు, గ్రామ పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ చేసి మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమంలో విభిన్న పాత్ర నిర్వహించి తెలంగాణకు సంబంధించిన అందరూ పార్లమెంటు సభ్యులును ఒక తాటి మీదకి తీసుకువచ్చి పార్లమెంట్ జరుగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని సకల జన ప్రజలు రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆదినాయకత్వానికి ఇక్కడ పరిస్థితులు క్లుప్తంగా వివరించి పార్లమెంటులో కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ఘనత రాజగోపాల్ రెడ్డిగారిది, భువనగిరి పార్లమెంట్ అయ్యాక ప్రప్రథమ పార్లమెంట్ సభ్యుడుగా గెలుపు పొందినాక భువనగిరి బిబినగర్ జనగామ రైల్వేస్టేషన్ ల పునరుద్ధరణ మరియు భువనగిరి నియోజకవర్గంలో ఎన్నో ఏండ్ల నుండి పెండింగ్ లో ఉన్న జగదేవపూర్ కు వెళ్ళేదారిలో అండర్ పాసింగ్ బ్రిడ్జి, బీబీనగర్ పట్టణానికి వెళ్లేందుకు అండర్ పాస్ బ్రిడ్జి ఫ్లైఓవర్ ఏర్పాటు చేశారు. అతను ఎంపీగా ఉన్న సమయంలో ఎస్టిమేట్ ప్రకారం కాకుండా ఎక్కువగా పని అయినందున నేను పని చేయను అని కాంట్రాక్టర్లు చేతులు ఎత్తివేస్తేన వెళ్లిపోవడంతో బునాది కాలువ పనుల గురించి చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు రైతులు అందరూ కలిసి రాజగోపాల్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్లగానే వెంబడే తన స్వంత డబ్బులతో ఆకాలువ పనులు పూర్తి చేయించి రైతుల పాలిట దేవుడు అయ్యాడు అలాగే రాయగిరి లో సిలిండర్ పేలి చనిపోతే వారి కుటుంబాలకు 15 లక్షల రూపాయలు స్వంతంగా ఇచ్చిన ఘనత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అలాగే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జనగామలో తన తల్లి అయిన సుశీలమ్మ పేరుమీద 3 కోట్ల రూపాయలతో ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వృద్ధుల గుండెల్లో పెద్ద కొడుకు అయ్యాడు. ఇంటర్ విద్యార్థిని విద్యార్థులకు 3నెలలు ఉచిత కోచింగ్ మరియు ఉండడానికి వసతి సౌకర్యాలు అలాగే కోచింగ్ కోసం వచ్చేవారికి బస్ సౌకర్యం కల్పించి వారి పాలిట కుటుంబ సభ్యునిగా నిలిచి అని సౌకర్యాలు కల్పించాడు. ప్రతీక్ ఫౌండేషన్ స్థాపించి అనేక సేవ కార్యక్రమములుచేసి అన్నా అంటే నేను ఉన్నా అని అర్ధరాత్రి సైతం అందుబాటులో ఉండి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆపదలో ఉన్న పేద ప్రజలకు కోమటిరెడ్డి బ్రదర్స్ దేవుళ్ళు అయ్యారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పొత్నక్ ప్రమోద్ కుమార్, గ్రామ సర్పంచ్ ఎదునూరి ప్రేమలత మల్లేశం, ఎంపిటిసి గుణకుంట్ల కల్పనా శ్రీనివాస్, ఉప సర్పంచ్ మైలారం వెంకటేష్, కౌన్సిలర్లు పడిగెల రేణుక ప్రదీప్, కైరంకొండ వెంకటేష్, గ్రామ వార్డు మెంబర్లు శ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షులు శ్రీ రాం బాలరాజు, బోల్లపల్లి అశోక్, కసరబోయిన సాయి, గాయపాక వెంకటేష్, రాము, నర్సింగ్ రావు, తదితరులు పాల్గొన్నారు.