నూతన మెడికల్ కళాశాల భవన పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రవి

Published: Saturday January 29, 2022

జగిత్యాల, జనవరి 28 (ప్రజాపాలన ప్రతినిధి): ఫిబ్రవరి నెలలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ సభ్యుల బృందం పర్యటన సందర్భంగా ముందస్తుగా జగిత్యాలలో నూతనంగా మంజూరైన మెడికల్ కాలేజ్ పనులను జిల్లా కలెక్టర్ రవి పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భవనాన్ని వీలైనంత త్వరగా పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్ డి ఓ మాధురి ఇతర అధికారులు పాల్గొన్నారు.