సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన ఏర్పాట్లు పూర్తి చేయాలి... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా

Published: Wednesday January 11, 2023
ఈనెల 12వ తేదీ నాడు భద్రాద్రి జిల్లాకు సీఎం కేసీఆర్ 
నూతన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లోని నూతన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు మంగళవారం నాడు జిల్లాలోని పలు శాఖల, అధికారులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు., ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్  పర్యటన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఈనెల 12వ తేదీనాడు సీఎం కేసీఆర్  చేతుల మీదుగా కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం కానున్నది, సీఎం కేసీఆర్ నాయకత్వంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో సమీకృత కలెక్టరేట్లు ఉన్నట్లు దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు, సుమారు 32 శాఖల అధికారులు ఒకే కార్యాలయంలో పరిపాలన ప్రారంభించు నందున ప్రజలకు సేవలు సులభతరం కానున్నాయన్నారు అన్ని సమస్యలకు పరిష్కారాలకు కలెక్టర్ కార్యాలయం వేదికగా మారదుందన్నారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వర్లు , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ దిండి గల రాజేందర్ , జిల్లా కలెక్టర్ శ్రీ దురిశెట్టి అనుదీప్  జిల్లా ఎస్పీ శ్రీ డాక్టర్ వినీత్ , జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్ల  పలు శాఖల జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.