బీరుపూర్ మండలంలో రైతుబందు సాంబరాలు విజయవంతం చేయండి

Published: Friday January 07, 2022

బీరుపూర్, జనవరి 06 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల కేంద్రంలో రైతువేదిక భవనంలో స్థానిక ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు రైతుబంధు వారోత్సవాలు జనవరి 9వ తేదీన మండలంలో అన్ని గ్రామాలలో సంబరాలు నిర్వహించడానికి మండల ప్రజా ప్రతినిధులు రైతుబందు సమితి కన్వీనర్లు గ్రామశాఖ అధ్యక్షులుతో చర్చించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెరాస నాయకులు నిర్ణయించారు. రైతుబందు వారోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కెడిసిసి డైరెక్టర్ ముప్పాల రాంచందర్ రావ్ కొలుముల రమణ నారపాక రమేష్ సర్పంచులు నల్ల మహిపాల్ రెడ్డి పర్వతం రమేష్ ఘర్షకుర్తి రమేష్ చిక్రం మారుతి చుంచు నరేందర్ ఏసు గంగరాజం కృష్ణారావు ఎంపీటీసీలు గ్రామశాఖ అధ్యక్షులు రైతుబంధు సమితి కన్వీనర్లు పాల్గొన్నారు.