28, 29 డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన మేయర్

Published: Thursday June 10, 2021
బాలపూర్, జూన్ 09, ప్రజాపాలన ప్రతినిధి : పలు కాలనీలలోనీ  అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు, త్వరగా పూర్తి చేయాలని కార్పొరేషన్ మేయర్ అధికారులను ఆదేశించారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ, డివిజన్ లిబ్రా ఎంక్లేవ్, శ్రీ నిలయం, నైన్ హిల్స్, సప్తగిరి కాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలు, అదేవిధంగా 29వ డివిజన్ లో వెంకటాద్రి నివాస్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్లు తో కలిసి కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్లు బుధవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ..... పలు కాలనీల్లో అభివృద్ధి పనుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని పనులు ప్రారంభించి, ఈ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. కాలనీవాసులు అందరికీ విజ్ఞప్తి.. కరోనా మహమ్మారి నుండి జాగ్రత్తలు పాటించండి అని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కార్పొరేషన్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, డిఈ అశోక్ రెడ్డి, ఏ ఇ బిక్కు నాయక్, టిఆర్ఎస్ కార్పొరేషన్ అధ్యక్షురాలు అమృత నాయుడు, 28 వ డివిజన్ కార్పొరేటర్ సూర్ణగంటీ అర్జున్, 29వ డివిజన్ కార్పొరేటర్ పెద్ద బావి శోభ ఆనంద్ రెడ్డి, కార్పొరేషన్ కార్పొరేటర్లు పెద్ద బావి శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల గూడెం శ్రీనివాస్ రెడ్డి, గుర్రం వెంకట్ రెడ్డి, ఆనంద్ రెడ్డి కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.