నాపై బఫున్లను పోటీకి పెట్టకుండా దమ్ముంటే కేసీఆర్ ఎన్నికల బరిలో ఉండాలని సవాల్ విసిరిన కోమ

Published: Tuesday September 27, 2022
చౌటుప్పల్, సెప్టెంబర్ 26 (ప్రజాపాలన ప్రతినిధి): మునుగోడు లో లక్ష పైచిలుకు ఓట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పడతాయని కెసిఆర్ మునుగోడు లో 100 మంది ఎమ్మెల్యేలను దింపినా రాజగోపాల్ రెడ్డి గెలుపు ను ఆపలేరని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలో వరకాంతం జంగారెడ్డి ఆధ్వర్యంలో 500 మంది.  జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వారందరినీ  పార్టీ కండువాలు కప్పి  తల్లోజు ఆచారి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం తల్లోజు ఆచారి మాట్లాడుతూ మునుగోడు లో రాజగోపాల్ రెడ్డి ప్రజల కోసం, మునుగోడు ఆత్మగౌరం కోసం, తన పదవీ కాలాన్ని త్యాగం చేసి నియంతృత్వ కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని రాజీనామా చేశారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక కెసిఆర్ నియంతృత్వ ప్రభుత్వానికి మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరిగే పోరు అన్నారు. ఈ ధర్మ పోరాటంలో అధర్మపరులకు ఓటమి తప్పదని అన్నారు. 8 సంవత్సరాలుగా కేసీఆర్ మునుగోడు ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, వృద్ధులకు పెన్షన్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇవ్వలేదని కేవలం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కేసీఆర్ అవన్నీ అమలు చేస్తున్నారని అన్నారు. బై ఎలక్షన్ వస్తేనే కెసిఆర్ కు అభివృద్ధి కనబడుతుందని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో  మునుగోడు ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా కెసిఆర్ నిమ్మకు నీరు అంటకుండా వ్యవహరించారని అన్నారు. ప్రజల కష్టాలను అసెంబ్లీలో గళం విప్పే  ప్రతిపక్ష శాసనసభ్యులను  ప్రలోభాలకు గురిచేసి టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ప్రశ్నించే గొంతులను కేసీఆర్ అనిచివేశారన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదవుల కోసం ఆశపడితే ఏనాడో టిఆర్ఎస్ పార్టీలో చేరేవాడని. కానీ రాజగోపాల్ రెడ్డి నిరంతరం మునుగోడు ప్రజల కష్టసుఖాలను చూసే వ్యక్తిగా ఉండడంతో ప్రలోభాలకు గురికాకుండా అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు గానే ఉండి పోరాడే వారన్నారు. 100 ప్రశ్నలకు జవాబు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని తెలంగాణకు పట్టిన కేసీఆర్ చీడ వదిలించడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని గెలిపించి కెసిఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడటానికి మునుగోడు ప్రజలు నాంది పలకాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తాగుబోతు ముఖ్యమంత్రి వల్ల ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల పాలైందని కోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నాకు 40 ఎకరాల భూమి ఉందని నాకు రైతుబంధు ఎందుకని ఎన్నోసార్లు అసెంబ్లీలో ప్రశ్నించి వచ్చిన డబ్బును పేద ప్రజలకు పంచానన్నారు. రైతుబంధు కేవలం కోటీశ్వరులకి అందుతున్నాయని చిన్న,  సన్న, కారు రైతులకు రైతుబంధు వల్ల న్యాయం జరుగుత లేదన్నారు.  సకాలంలో ఎరువులు, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర, ఇస్తే రైతులకు ఎలాంటి రైతుబంధు అవసరం లేదన్నారు. అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు ఇస్తున్నానని చెప్పే కేసిఆర్ గ్రామాలలో బెల్టు షాపులు పెట్టి ప్రజల ప్రాణాలు తీస్తున్నారన్నారు. కెసిఆర్ కుటుంబ దోపిడిని అడ్డుకోవడానికి మునుగోడు ప్రజలకు అవకాశం వచ్చిందన్నారు. యావత్ భారతదేశం మొత్తం మునుగోడు ఉప ఎన్నికను చూస్తున్నారని కెసిఆర్ నియంతృత్వ పాలనకు మునుగోడు ప్రజలే చరమగీతం పాడాలని అన్నారు. చౌటుప్పల్ మండలంలో బిజెపికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని. మండలంలోని ప్రతి గ్రామంలో ప్రజలు కంకణ బద్ధులై బిజెపి పార్టీలో చేరుతున్నారన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కనీసం వార్డ్ మెంబర్ గా కూడా గెలవరని ఎద్దేవా చేశారు. మునుగోడు లో కేసీఆర్ నాపై బఫున్లను పోటీకి దింపుతున్నారని దమ్ముంటే కేసీఆర్ నామీద పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ జడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి. భాజపా మండల పార్టీ అధ్యక్షులు రెక్కల సుధాకర్ రెడ్డి, 
డి నాగారం బిజెపి నాయకులు పులిగిల్ల శ్రీనివాస్ చారి, దేవెల్లి సత్యనారాయణ, సిలివేరు రమేష్, అంతపురం వెంకట్ రెడ్డి, పందుల శరత్ గౌడ్, పందుల వెంకటేష్, కొండ సాయి గౌడ్, వివిధ గ్రామాల భాజపా  ప్రజా ప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు, అధిక సంఖ్యలో దేవలమ్మ నాగారం గ్రామ ప్రజలు,  భాజపా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.