శ్రీ గంగమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యెక పూజలు.. --ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జిల్లా జడ్పీ చైర్పర్సన

Published: Saturday July 30, 2022

జగిత్యాల, జూలై, 29 ( ప్రజాపాలన ప్రతినిధి): తిప్పన పేట గ్రామపంచాయతీ పరిధిలో గల శ్రీ గంగమ్మ తల్లి దేవాలయంలో అన్నదాన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ప్రారంభింనారు. అనంతరం భక్తులతో కలిసి భోజనం చేసినారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బోగ శ్రావణీ ప్రవీణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, జిల్లా కౌన్సిలర్ల ఫోరం అద్యక్షులు పంబాల రాము, కౌన్సిలర్లు కూసరి అనిల్, సిరికొండ పద్మసింగరావు, పిట్ట ధర్మరాజు, చుక్క నవీన్, అల్లే గంగాసాగర్ నాయకులు రౌతు గంగాధర్, శేఖర్, ఒమన్ మరియు గంగ పుత్ర సంఘం అద్యక్షులు కొండ్ర శంకర్, ఉపాధ్యక్షులు సిరికొండ రాజేందర్, ప్రధాన కార్యదర్శి కొండ్ర రాజేంద్ర ప్రసాద్, మరియు గంగపుత్ర సంఘం సభ్యులు కులబాంధవూలు తదితరులున్నారు.