సాయికుంట చెరువుని కాపాడాలి. ఐక్య విద్యార్థి సంఘాల వినతి.

Published: Friday January 06, 2023
మంచిర్యాల టౌన్, జనవరి 05, ప్రజాపాలన :  మంచిర్యాల పట్టణం లో ని సాయికుంట చెరువుని కాపాడాలని గురువారం ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపాలిటీ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు.   ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ మంచిర్యాల పట్టణం అభివృద్ధి చెందుతున్న కొద్ది పట్టణం లోని చెరువులు కబ్జాకు గురవుతున్నాయి, ప్రభుత్వం ఒక పక్క చెరువులను కాపాడి వ్యవసాయానికి వెన్నుదన్నుగా ఉండాలంటే, మరోపక్క రియల్ వ్యాపారులు స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల సహకారంతో పట్టణంలో ఉన్నటువంటి చెరువులను కబ్జాలు చేస్తూ అక్రమ వెంచర్లు వేస్తున్నారని అన్నారు.   మంచిర్యాల మున్సిపాలిటీ పాలక వర్గం ప్రతిపాదించిన సాయి కుంట చెరువు సుందరీకరణ పనుల్లో భాగంగా చెరువు యొక్క పూర్వపు హద్దులను వదిలి కరకట్టలు పోయడం వల్ల ప్రభుత్వ ఆశయం దెబ్బతినడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు,  అధికారులకు వరంగా మారిందని ఇట్టి సాయి కుంట చెరువు పై గతంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని అట్టి ఫిర్యాదుతో అధికారులు ఎఫ్ టి ఎల్ ఏర్పాటు చేసి శిఖం భూమిని వదిలేసారని దాంతో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు జోరుగా అక్రమ వెంచర్లు వేసి వ్యాపారాలు చేస్తున్నారని, ఇప్పటికైనా ఇట్టి కబ్జాలపై   స్పందించి పట్టణంలోని చెరువులను కాపాడాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో 
సల్మాన్ షేక్, బచ్చలి ప్రవీణ్ కుమార్, పురేళ్ళ నితీష్
 తదితరులు పాల్గొన్నారు.