ఇబ్రహీంపట్నం జూన్ తేది 3 ప్రజాపాలన ప్రతినిధి.

Published: Saturday June 04, 2022
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోతుంది
భూమి దక్కే వరకు పాదయాత్ర కొనసాగిస్తా అన్న ఐలేష్ కుటుంబం*

పేదవాడి నష్టపరిహారం కొంత మంది అధికారులు కాజేశారని  ఆరోపిస్తూ,11 సంవత్సరాల నుండి నష్టపరిహారం కోసం నిరీక్షిస్తున్నాని,అధికారులు ప్రజా ప్రతినిధులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని  శుక్రవారం మున్సిపల్ పరిధిలోని  కట్టమైసమ్మ దేవాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర  కార్యక్రమం  భూ బాధితుడు  మాషామొని ఐలేష్ చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తన తండ్రి వెంకయ్యకు 1979లో సర్వే నంబరు  58 పార్ట్ నెంబర్ 306లో 5 ఎకరాల భూమిని భూదాన్ బోర్డు పట్టా ఇచ్చింది. తండ్రి మరణానంతరం ఆ 5 ఎకరాల భూమి తన ఆధీనంలో  ఉందని పేర్కొన్నారు.2010లో ఎన్ఎస్ జి  కోసం సేకరించిన భూమిలో తన భూమి కూడా తీసుకున్నారని,ఇందుకుగాను ఎకరాకు 5.4 లక్షల చొప్పున ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది.కానీ ఈ డబ్బులలో ఐలేష్   కుటుంబానికి ఒక్క పైసా కూడా రాలేదు. కొంతమంది వ్యక్తులు అధికారులతో కుమ్మక్కై  తప్పుడు నకిలీ పత్రాలు సృష్టించి నష్టపరిహారాన్ని  మద్దెల విజయ్ కుమార్,అనిల్ కుమార్,సునీల్ కుమార్ కాజేశారని ఆవేదన వ్యక్తం చేశారు.వీరికి పూర్తి సహకారం 
అప్పటి వీఆర్వో రామ్ రెడ్డి, తహాసిల్దార్ విఠల్, ఆర్డిఓ రాజేందర్ అందించరాని, పేదవాడి డబ్బుల కోసం కక్కుర్తి పడి కాజేశారని,ఇదేంటని నిలదీస్తే  పొంతనలేని  సమాధానాలు చెబుతున్నారనిన్నారు.2014లో భూదాన్ బోర్డు రద్దు చేయడంతో ఏమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారని,2017 నవంబర్లో  ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని,  పోలీసులు కేసు నమోదు చేసుకొని భూధన్ బోర్డు, రెవెన్యూ అధికారులను వివరాలు తెలపాల్సిందిగా కోరగా ఎటు తేల్చలేకపోయారాని,ఈ  ఘటన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని,ఈ విషయంపై  సీపీ మహేష్ భగవత్ కు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కి,  అదికారులకు మంత్రులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేకపోయిందని,దింతో సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ ముందు కూడా కుటుంబంతో సహా ఆత్మహత్య యత్నం చేసిన  కూడా న్యాయం జరగలేదని,11 సంవత్సరాల భూ పోరాటంలో ఉన్న ఇల్లు కూడా అమ్మేసి లక్షల రూపాయలు నష్టపోయి, రోడ్డున పడ్డానని, కుటుంబం ఎంతో దయనీయ స్థితిలో ఉందని తినడానికి తిండి కూడా అలమటిస్తున్నామని, అయినా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించకపోతే కుటుంబానికి మరణమే శరణ్యమని ఆవేదన చెందారు.ఈ పాదయాత్రతోనైనా కలెక్టర్  తమకు న్యాయం చేయాలని కోరారు.తన నష్ట పరిహారం కాజేసిన అధికారులు సంబంధిత వ్యక్తులను వెంటనే ప్రభుత్వం శిక్షించాలని డిమాండ్ చేశారు.