నూతన వ్యవసాయ చట్టం సమావేశంలో - బండి సంజయ్

Published: Saturday December 26, 2020

◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం

జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన): జగిత్యాల జిల్లాకేంద్రం విరుపాక్షి గార్డెన్ లో  నూతన వ్యవసాయ చట్టం  అవగాహన సమావేశంలో కరీంనగర్ ఎంపి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాలుగొన్నారు. నూతన వ్యవసాయ చట్టాన్ని ఉద్దేశించి బండి సంజయ్  మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా రైతులు తాము పండించుకున్న పంటకు తామే ధరను నిర్ణయించుకునే హక్కు మరియు దేశంలో ఇష్టం వచ్చిన ప్రాంత మార్కెట్లో అమ్ముకునే హక్కును కలిగి ఉంటారని, రైతులకు ఎంతో మేలుచేసే ఇంతగొప్ప చట్టాన్ని టీఆరెస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేక రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. సమావేశం మొదట ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తెలికాన్ఫిరెన్సు ఉపన్యాసంతో ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ జెఎన్ వెంకట్ గుడాల రాజేశం భాస్కర్ ముందుగంటి రవీందర్ రెడ్డి రాగిల్ల సత్యనారాయణ ఆముదం రాజు గుర్రం రమేష్, నక్క అశోక్, కృష్ణ హరి, పులి రమ శ్రీధర్, ఎర్ర రాజు, ఎర్ర లక్ష్మీ, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.