రహమత్ నగర్ లో రిజర్వాయర్ కు భూమి పూజ చేసిన జూబ్లీహిల్స్ ఎం ఎల్ ఏ మాగంటి గోపినాధ్. హైదరాబాద్ (ప

Published: Thursday August 04, 2022

రాజకీయ నాయకుల మాట నీటి మూట అన్నది గతంలో ఒక నానుడి. అయితే అందుకు విరుద్ధంగా మంత్రి తన డివిజన్ లో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఆ ఎం ఎల్ ఏ చేస్తున్న  కృషి వల్ల ఆ ప్రాంత వాసులకు తాగునీటి ఇబ్బందులు తొలగడం విశేషం. వివరాలలోకి వెళితే...మంత్రి కేటీఆర్ రహమత్ నగర్ డివిజన్ కి వచ్చిన సమయంలో ఇక్కడి ప్రజల కోరిక మేరకు ఇక్కడ ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ నెరవేర్చడానికి జూబ్లీహిల్స్ ఎం ఎల్ ఏ మాగంటి గోపినాధ్ చేస్తున్న కృషికి సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. మంత్రి చెప్పిన ప్రకారం 11 కోట్ల రూపాయలతో వ్యయం తో నిర్మించనున్న మంచి నీటి రిజర్వాయర్ కి  బుధవారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్...రహమత్ నగర్ డివిజన్ ఎస్.పి.ఆర్. హిల్స్ లో ఈ రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. ఎత్తుగా ఉన్న ప్రాంతం కావడంతో పలు దిగువ ప్రాంతాలకు నీటి సరఫరా ఇబ్బందులు తొలగనున్నాయి. ఈ సందర్బంగా మాగంటి మాట్లాడుతూ నియోజకవర్గంలో పేద ప్రజలకు మౌలిక వసతులు కల్పించి పేద ప్రజలను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు... బోరబండకు సమీపంలో నగరంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో 40 ఏండ్ల క్రితం ఏర్పడిన శివమ్మ పాపిరెడ్డి హిల్స్ (ఎస్.పి.ఆర్. హిల్స్) లో నాడు నీటిచుక్క కోసం ప్రజలు అల్లాడిపోయేవారు అని అన్నారు... నేడు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్తీలుగా ఏర్పడిన రహమత్ నగర్, బోరబండ ప్రజల దాహార్తి తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం 40 లక్షల లీటర్ల కెపాసిటీతో భారీ రిజర్వాయర్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసిందన్నారు... తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమలు చేస్తున్నామన్నారు... రానున్న 6 నెలల్లో రిజర్వాయర్ ను నిర్మించి ప్రజలకు మంచి నీళ్ల ను అందించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు... ఈ కార్యక్రమంలో  స్థానిక కార్పొరేటర్ సి.ఎన్.రెడ్డి,స్థానిక ప్రభుత్వ అధికారులు, టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...