ఎస్టీ మినీ గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం - మల్లాపూర్

Published: Thursday June 10, 2021
మల్లాపూర్, జూన్ 09 ( ప్రజాపాలన ప్రతినిధి ) : మల్లాపూర్ మండల కేంద్రంలోని మినీ గిరిజన గురుకుల పాఠశాలలో 2021-22 సంవత్సర విద్య అభ్యసం కోసం మొదటి తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.  మల్లాపూర్ మినీ గిరిజన గురుకుల ప్రధానోపాధ్యాయురాలు బి వినోద బుధవారం తెలియజేశారు. ఆసక్తిగల గిరిజన బాలికల ప్రవేశానికి ఈ నెల 25 తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, మొదటి తరగతిలో ఇంగ్లీష్ మీడియములో 30 సీట్లు ఖాళీగా ఉన్నాయని ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు పూర్తి వివరాలకై 9502331270, 9441859083, 7095192867 సెల్ నంబర్లుకు సంప్రదించగలరని కోరారు.