మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ** సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ ** కల

Published: Tuesday July 19, 2022

ఆసిఫాబాద్ జిల్లా జులై18(ప్రజాపాలన, ప్రతినిధి) : మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, 3 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ డిమాండ్ చేశారు. సోమవారం తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులకు 3 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ, అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన కార్మిక సమస్యలు పరిష్కరించక పోవడాన్ని తీవ్రంగా ఖండించారు. అధికారులు బడా కంపెనీలకు వత్తాసు పలుకుతూ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలకు కారణం అవుతున్నారని అన్నారు. భగీరథ కాంట్రాక్ట్ కార్మికులకు పిఆర్సి కమిషన్ చైర్మన్ చెప్పిన ప్రకారం రూ 19 వేలు వేతనం ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ, హెల్త్ కార్డులు, వారాంతపు సెలవులు, 8 గంటల పని దినాలు అమలు చేయాలని కోరారు. డిమాండ్ల ప్రకారం పై అధికారులు సాధించకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియుసి జిల్లా కార్యదర్శి రాజేందర్, భగీరథ సంఘం నాయకులు విట్టల్, భీమ్ రాజ్, లింగయ్య బాలేష్, సతీష్, సుదర్శన్, కార్తీక్,తదితరులు పాల్గొన్నారు.