డాక్టరేట్ పొందిన విద్యార్థినికి సన్మాన"** జెడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు

Published: Tuesday August 02, 2022

ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు 01(ప్రజాపాలన, ప్రతినిధి) : ఆసిఫాబాద్ మండలంలోని బూరుగుడా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గాజుల సత్యనారాయణ కుమార్తె గాజుల ప్రవళిక, ఇటీవల డాక్టరేట్ పొందిన సందర్భంగా తెరాస రాష్ట్ర సహాయ కార్యదర్శి, జెడ్పిటిసి, అరిగెల నాగేశ్వర్ రావు సోమవారం ఎంపీపీ కార్యాలయంలో గాజుల ప్రవళిక కు పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో  సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ చిన్న గ్రామం, మరియు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి  ఉన్నత శిఖరాలను అధిరోహించడం అభినందనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిగెల మల్లికార్జున్, ఎంపీడీవో శశికళ, ఎంపీపీ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.