ఘనంగా జన్మదిన వేడుకలు

Published: Saturday December 10, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 9 ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణంలో మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు, సోనియాగాంధీ 76వ జన్మదిన వేడుకలు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంకటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో  కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సోనియాగాంధీ పార్టీకి చేసిన, చేస్తున్న సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి రోడ్డ శారద, జిల్లా ఉపాధ్యక్షులు తొంగల మల్లేష్ , మండల అధ్యక్షుడు బాకం మల్లేష్,మున్సిపల్ కౌన్సిలర్ గుజ్జ రవి,మాజీ కౌన్సిలర్లు రోడ్డ శ్యామ్, చింతపండు.శ్రీనివాస్, అఫ్జల్,  లెంకల శ్రీనివాస్,అంకం రవి ,జి.సమ్మన్న ,  పోచంపల్లి హరీష్ , ఎలుక ఆకాష్ , వినేష్ ,  టి ఎల్ చారి,గాలి శ్రీనివాస్,దేవసాని ఆనంద్,సల్ల చందు, రాజిరెడ్డి, గౌస్, తదితరులు పాల్గొన్నారు.