మండలంలో హోలీ వేడుకలు

Published: Wednesday March 08, 2023
జన్నారం, మార్చి 07, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో హోలీ వేడుకలు ఆకట్టుకున్నాయి. మంగళవారం మండల కేంద్రంలో జెడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. మండలంలోని పలు గ్రామాలలో చిన్నారులు యువకులు పెద్దలు మహిళలు హోలీ సంబరాలు ఆనందోత్సవం మధ్య ఒకరికి ఒకరు రంగులు చల్లుకొని హోలీ పండుగ నిర్వహించుకున్నారు. మండల ప్రజలు పలు రకాల రంగు ఒకరికి ఒకరు పూసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రకరకాల రంగులతో చిన్నారులు పెద్దలు తోటి వారికి రంగులు పూస్తూ కేరింతల మధ్య హోలీ సంబరాలు నిర్వహించుకున్నారు. మండల పలువురు ప్రముఖులు హోలీ సంబరాల్లో పాలుపంచుకుంటూ ఉత్సాహాన్ని తెచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని చిన్నారులు, యువకులు, పెద్దలు, మహిళలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాల్గొన్నారు.