శ్రీ సరస్వతి శిశు మందిర్ పునః నిర్మాణ భూమి పూజ లో పాల్గొన్న క్షేత్ర విద్యాపీఠ, ఆర్.ఎస్.ఎస్.అఖి

Published: Monday April 04, 2022

రాయికల్. ఏప్రిల్ 2; (ప్రజాపాలన ప్రతినిధి) రాయికల్ పట్టణ కేంద్రంలో నూతన సంవత్సరఉగాది శ్రీ శుభకృతు నామ సంవత్సర రోజున ఉదయ శ్రీ సరస్వతి శిశు మందిర్ పునఃనిర్మాణం భూమి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్షేత్ర విద్యాపీఠ (మూడు రాష్ట్రాల )ఆర్.ఎస్.ఎస్. అఖిలభారత క్రీడా ప్రముఖ్ మాననీయ లింగం సుధాకర్ రెడ్డి ప్రధాన వక్తగా ఉపన్యాసిస్తూ శ్రీ సరస్వతి శిశు మందిర్ రాలలో జాతీయ భావాలతో కూడిన ఉన్నతమైన సంస్కారంతో పాటు, వ్యక్తిత్వ వికాసం ధ్యెయంగా దేశభక్తులను తయారు చేయడమే పరమావధిగా శిశు మందిరాలు నడుస్తున్నాయి. శ్రీ సరస్వతి విద్యా పీఠ మందిరాలలో  నిష్ణాతులైన, సుశిక్షితులైన ఆచార్యుల ఆచరణాత్మక మైన విద్యా బోధన ప్రాచీన గురుకుల తరహా విద్యను విద్యాపీఠం అందిస్తుందని ఆయన తెలిపారు. శ్రీ సరస్వతి శిశు మందిరాలలో చదివిన విద్యార్థులు అన్ని రంగాలలో ముందున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా పీ ఠ ప్రతినిధులు, పూర్వ విద్యార్థులు  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయం సేవకులు, ప్రముఖులు, పూర్వాచార్యులు పాల్గొన్నారు.