రక్తదానం చేస్తే, ప్రాణదానం చేసినట్లే రామగుండం సి పి ఎస్, చంద్రశేఖర్ రెడ్డి

Published: Wednesday October 19, 2022
బెల్లంపల్లి అక్టోబర్ 18 ప్రజా పాలన ప్రతినిధి: రక్తదానం చేస్తే ప్రమాదంలో ఉన్నవారికి ప్రాణాదానం చేసినట్టే అని, రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి  అన్నారు.
ఈనెల 21న జరిపే పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని, బెల్లంపల్లి పట్టణంలోని 2 గ్రౌండ్లో బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసుల, మంచిర్యాల  జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తం దానం చేస్తే ప్రమాదం లో ఉన్న వారి ప్రాణాలను కాపాడిన వారమవుతామని, అలాంటి రక్తాన్ని ప్రతి యువకుడు అందిస్తే ఎంతోమందికి ప్రాణాలను నిలిపిన వారమౌవుతామని అన్నారు.
 ప్రతి ఒక్కరూ రక్త దానం చేస్తూ, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి సహాయపడాలని అన్నారు. ముఖ్యంగా యువకులు అప్పుడప్పుడు రక్తదానం చేస్తూ ఉండాలని, రక్తదానం చేస్తే నష్టమేమి లేదని, చేయకపోతేనే నష్టమని ఆయన దాతలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా 2360 యూనిట్ల రక్త దాన సేకరణ జరిగిందని, ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టి రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన ఎసిపి ఎడ్ల మహేష్, ను సిపి చంద్రశేఖర్ రెడ్డి ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసిపి ఎడ్ల మహేష్, సబ్ డివిజన్లోని బెల్లంపల్లి సిఐలు ముస్కేరాజు, కోట బాబురావు, మందమర్రి సిఐ ప్రమోద్ రావు, తాండూరు సి ఐ  జగదీష్, ఎస్ఐ లు, తాండూరు, భీమిని, కన్నెపల్లి, కాసిపేట, మండలాల్లోని యువకులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.