ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ ప్రధాన అజెండా*

Published: Tuesday December 27, 2022
మంచిర్యాల టౌన్, డిసెంబర్ 26, ప్రజాపాలన: ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ ప్రధాన అజెండా అని ఓట్లు,సీట్లు కమ్యూనిస్ట్ లకు ప్రామాణికం కావని, భారత కమ్యూనిస్టు పార్టీ  చెన్నూరు నియోజకవర్గ  కార్యదర్శి మిట్టపల్లి పౌల్  అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 98వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని సిపిఐ చెన్నూర్ మండల సమితి ఆధ్వర్యంలో  పట్టణం లో అరుణ పతాకాన్ని  ఆవిష్కరించి, అనంతరం ఆయన మాట్లాడతూ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ  1925 డిసెంబరు 26 వ తేదీన ఆవిర్భవించిందని, సిపిఐ సహజ సిద్ధంగానే దేశంలో ప్రధాన భాగంగా అత్యంత ప్రగతిశీల, గర్వించదగిన ఉద్యమాలకు గొప్ప నాయకత్వాన్ని సిపిఐ పార్టీ అందించిందని అన్నారు.  
భారతదేశ సార్వభౌమత్వాన్ని, లౌకిక, ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణకై, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కై సిపిఐ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు మండల కార్యదర్శి  సమ్మయ్య, ఏఐవైఎఫ్  నియోజకవర్గ నాయకులు రాజలింగు మోతె,  నాయకులు దుర్గం శంకర్ సుంకరి చందు, నేన్నెల రంజిత్ తదితరులు పాల్గొన్నారు.