డి ఎం హెచ్ ఓ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 50లక్

Published: Thursday September 01, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 30 ప్రజా పాలన ప్రతినిధి

ఈరోజు వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మాజీ మంత్రి కోండ్రు పుష్పలిల మరియు రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అద్యక్షురాలు జయమ్మ గ్రేటర్ హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ అద్యక్షురాలు వరలక్ష్మి మరియు మహిళ కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి రమావత్ జ్యోతి శ్రీనివాస్ నాయక్ ,మాదవి లు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుసుకోని , కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి, నిర్లక్ష్యంగా వ్యవహరించి అమాయక మహిళల ప్రాణాలను తీసిన డాక్టర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్వో కార్యాలయం దగ్గర దర్న నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది .బాదిత కుటుంబ లకు యాబై లక్షల నష్టపరిహారం చెల్లించాలని మరియు ప్రతి కుటుంబ లోని ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసారు. అనంతరం పోలీసులు అరెస్టు చేసి సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ కు తరలించారు.ఇప్పటికైనా ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకొని జరిగిన సంఘటన పైన ఎంక్వయిరీ కమిషన్ వేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని లేనియెడల కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలిపారు.