74వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.

Published: Monday November 28, 2022

మణుగూరు ( ప్రజా పాలన.)

ఈరోజు 26 నవంబర్ 1949 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా రాయబడిన రాజ్యాంగం ఆమోదించిన రోజు అని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. భారత రాజ్యాంగం నేటికీ 73 సంవత్సరాలు పూర్తి చేసుకుని 74 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశంలోని కాకా ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం మన భారత రాజ్యాంగం అని ఆయన కొనియాడారు. భారత రాజ్యాంగం 26 జనవరి 1950 రోజున అమల్లోకి వచ్చిందని 29 ఆగస్టు 1947 నాడు 299 సభ్యులతో రాజ్యాంగ పరిషత్ చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ మరియు రాజ్యాంగ రచన డ్రాప్టింగ్ కమిటీ చైర్మన్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నిక చేయబడ్డారని వారు తెలిపారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏదైనా సరే రాజ్యాంగం ద్వారానే నడుచుకోవాలని రాజ్యాంగబద్ధంగా వెళ్లాలని ప్రజలందరికీ కూడా జీవించే హక్కు , వాక్కు స్వాతంత్రపు హక్కు, మహిళా స్వతంత్రపు హక్కు ఆస్తి హక్కు కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని వారు అన్నారు. అంతేకాకుండా అనగారిన వర్గాల కోసం రిజర్వేషన్లతో పాటు రాజకీయ రిజర్వేషన్లు కూడా కల్పించిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని వారికి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు మనం ఉపయోగించుకున్నటువంటి ఓటు హక్కు కూడా ఆ మహానుభావుడు కల్పించింది అని ప్రతి ఒక్క వ్యక్తి ఎలక్షన్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకొని వారికి నచ్చిన నాయకుని ఎన్నుకునే అవకాశం మనకు భారత రాజ్యాంగం కల్పించిందని వారు తెలియజేశారు.