బిజేపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా రెండోసారి కోట్నాక విజయ్ ** బిజెపి జిల్లా అధ్యక్షుడు కొత్త

Published: Thursday December 01, 2022
ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 29 (ప్రజాపాలన, ప్రతినిధి) : 
 
బిజేపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా రెండోసారి కొట్నాక  విజయ్ కుమార్ ను ప్రధాన కార్యదర్శిగ కొనసాగిస్తున్నట్లు బిజేపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలోని బిజేపి కార్యాలయంలో ఎర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లడుతూ పార్టీ బలోపేతం కోసం పని చేసిన నాయకులకు గుర్తింపును ఇస్తూ పదవులు అప్పగించడం జరిగిందని అన్నారు.  నిజాయితీగా పని చేసి పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తేవాలని అన్నారు. అనంతరము బిజేపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోట్నక విజయ్ కుమార్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు సేర్ల మురళి, విశాల్, తదితరులు పాల్గొన్నారు.