ఇబ్రహీంపట్నం మే తేది ప్రజాపాలన ప్రతినిధి.

Published: Tuesday May 31, 2022

ఐక్య పోరాటాల ద్వారానే కార్మిక సమస్యలు పరిష్కారం*
           
*డి.కిషన్ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు*

    కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలను ఐక్య పోరాటాల ద్వారానే  ప్రతిఘటించాలని సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు డి.కిషన్ అన్నారు
     సిఐటియు 52వ  ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తుర్కయంజాల్ చౌరస్తాలో కార్మికులతో కలిసి  సిఐటియు జెండాను ఎగరవేయడం జరిగింది.
        ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ  1970 వ సంవత్సరం మే 30 వ తేదీన బీటీ రణదివే అధ్యక్షులుగా, పి రామ్మూర్తి  ప్రధాన కార్యదర్శిగా ఐక్యత పోరాటం అనే నినాదంతో ఏర్పడిందని అన్నారు. గత 52 సంవత్సరాల నుండి ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గానికి  పండగ నిలబడుతూ వారి హక్కుల కోసం పోరాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్మికుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తుందని, తద్వారానే దేశంలోనే అత్యంత పెద్ద కార్మిక సంఘంగా ఎదిగిందని అన్నారు.
ఇటీవల కాలంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం  కార్మిక చట్టాలను హక్కులను కాలరాస్తూ 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా మారుస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టిందని అలాంటి కార్మిక వ్యతిరేక బిల్లులను తిప్పికొట్టేందుకు  కార్మికులంతా ఐక్య పోరాటాలు ద్వారా ప్రతిఘటన ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
    ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గుర్రం జంగయ్య,యం.జే ప్రకాష్ కరత్, లింగారెడ్డి, రాములు, రాజు, యాదగిరి, చెన్నారెడ్డి, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.