మద్యం టెండర్లపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదు

Published: Monday November 22, 2021

మధిర నవంబ21 ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం టెండర్లపై ఉన్న శ్రద్ధ విద్యా వ్యవస్థపై లేదని AISF ఖమ్మం జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ విద్యార్థులకు గత మూడు సంవత్సరాల నుంచి చెల్లించవలసిన స్కాలర్షిప్ 3800 కోట్లు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, గురుకులాలకు సొంత భవనం నిర్మించడంలో, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు భర్తీ చేయడంలో కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఒకపక్క ప్రభుత్వ పాఠశాల మూసేస్తూ మరో పక్క మద్యం షాపులు గణనీయంగా పెంచుతూ మద్యం షాపులకు లైసెన్సులు ఇస్తున్నారని విద్యారంగాన్ని కాపాడవలసిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.