మంత్రివర్ర్యులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) నియోజకవర్గంలో అకస్మాక పర్యటన సందర్భంగా

Published: Thursday July 21, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 20 ప్రజాపాలన ప్రతినిధి.ఈనెల 24వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రివర్ర్యులు  కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) 23వ తేదీన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలోని కాగజ్ ఘట్ గ్రామ పరిధిలో పాల్గొనే హరితహారం కార్యక్రమ స్థలాన్ని పరిశీలించి, అనంతరం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని గురునానక్ కళాశాలలో నిర్వహించే రక్తదాన శిబిరం స్థలాన్ని మంచాల ఎంపిపి నర్మద లచ్చిరం  టిఆర్ఎస్ పార్టీ మంచాల మండల  అధ్యక్షులు  చీరాల రమేష్ గురునానక్ వైస్ చైర్మన్ కోహ్లీ తో  కలిసి పరిశీలించిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి. అనంతరం ఏరుపట్ల పై స్థానిక నాయకులతో చర్చించన  బంటీన్న. మంత్రి  కేటీఆర్  మీటింగ్  స్థలాన్ని  స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో  కలిసి  పరిశీలించిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి . 
ఈ కార్యక్రమంలో   టిఆర్ఎస్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యువజన  అధ్యక్షులు  జేర్కొని రాజు,నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షులు
నిట్టు  జగదీశ్వర్, టిఆర్ఎస్ పార్టీ మంచాల మండల యువజన విభాగం అధ్యక్షులు బద్రినాధ్ గుప్తా, జిల్లా యువత నాయకులు యండి జాని పాష,పసుల చంద్ర కాంత్,మంచాల విద్యార్ధి విభాగం అధ్యక్షులు బొట్టు ప్రవీణ్ నాయక్, జాపాలు ఉప సర్పంచ్  మల్లప,నాయకులు దేవేందర్ గౌడ్,పూజారి భిక్షపతి ముదిరాజ్,బిన్ సతీష్,వీరిష్,విజయ్,నిఖిల్, మధు,గౌడ్, కేశవ్,  స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.