ప్రజాపాలన షాబాద్ ::--షాబాద్ మండల్ మన్మరి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు పూలమాలలు వే

Published: Wednesday December 07, 2022

ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ వారసులు నర్సింలు అంజయ్య  మాట్లాడుతూ రాగి విత్తు రవ్వంత ఓ పక్షి రెట్ట నుంచి వస్తుంది ఏ గోడ సందులో పడి అక్కడే మొలిచి ఎలాగో పెరిగి వటవృక్షమై ఎందరికో నీడనిస్తుంది మన బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం అలాంటిదే కుల వివక్షతో అడుగడుగునా అవమానం లేత వయసులో అంటరానివాడని దూరం దూరం అన్నారు పసిడి హృదయం గాయమైంది మనసును కలచివేసింది పట్టుదల పెరిగింది దేయం దృఢమైంది చదువులమ్మ అంటరాని వాడని చుడక ఆదరించింది అందలం ఎక్కించింది డిగ్రీల కిరీటాలు నెత్తిన పెట్టింది చుక్కల్లో చంద్రుని లా చేసింది మట్టిలో మాణిక్యంలా ఎదిగాడు వచ్చినా అవకాశాలు జారవిడచక ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగాడు మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్న నిలువెత్తు నిజాయితీపరుడు పోరాటాలంటే ముందుండే పోరాట యోధుడు సమానత్వమే మానవత్వ మనుగడకు సోపానం అన్న స్ఫూర్తి ప్రదాత ఆస్ఫూర్తితో రాజ్యాంగ రచన కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న నానుడికి ప్రతీక మన బాబాసాహెబ్ తెలివితేటలను కులమనే కట్టడి చేయలేదని నిరూపించిన మహా మనిషి మబ్బు వెనక దాగిన సూర్యుడు మన అంబేద్కర్ భారతరత్నంగా ఎదిగి దళిత డైమండ్ మన అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే కాకుండా  ప్రతి ఒక్క కులం వారు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో *అధ్యక్షుడు అర్జునయ్య  షాబాద్ సత్యనారాయణ బేగరి అంజయ్య అంతారం నర్సింలు  రంగాపురమ్ వెంకటేష్ బేగరి శంకరయ్య ఎర్ల జగదీష్ రెడ్డి  అంతారం రాంచెంద్రయ్య బేగరి జంగిలయ్య కాకర్జాల శంకరయ్య అంతారం చిన్న నర్సింలు కందివనం నర్సింలు గౌడ్ కందిమనం సత్యనారాయణ గౌడ్ అంతరం సతీష్ బేగరి మోహన్ సాకలి వెంకటేష్ చాగంటి నగేష్ రంగపూరం మహేందర్ సురేష్ గౌడ్ బేగరి మధు భానుచందర్ గౌడ్ మురళి శాగంటి బాబు శ్రీరంగపూరం శ్రీను తదితరులు పాల్గొన్నారు*