ఘనంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు

Published: Monday March 14, 2022
మధిర మార్చి 13 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు. గౌరవ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అక్క జన్మదిన వేడుకలు ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో తెలంగాణ జాగృతి మధిర మండల అధ్యక్షులు పగిడిపల్లి వినోద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి మధిర నియోజకవర్గ ఇన్చార్జి బొబ్బిల పాటీ బాబు రావు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆశ్రమంలో అనాధలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో మరుగున వేయబడ్డ సంస్కృతి సంప్రదాయాలను వెలుగులోకి తీసుకుని వచ్చి బతుకమ్మ పండుగను విశ్వ నిలబెట్టిన ఘనత కవిత దక్కుతుంది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బంక తులసి రావు. బొక్క జగన్. మధిర రెస్క్యూ టీం బాధ్యులు దోర్నాల రామకృష్ణ నిస్సి రామారావు తదితరులు పాల్గొన్నారు.