ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Published: Friday June 25, 2021
జన్నారం, జూన్ 24, ప్రజాపాలన ప్రతినిధి : జగిత్యాల జిల్లాలోని నూక పల్లిలో న్యాక్ ఆధ్వర్యంలో నిర్మాణ రంగంలో అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ పి అశోక్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు, ల్యాండ్ సర్వేయర్ ఎలక్ట్రికల్ వైరింగ్ వెల్డింగ్ ప్లంబింగ్ మరియు శానిటేషన్ పెయింటింగ్ మరియు డెకరేషన్ స్టోర్ కీపర్ తదితర రంగాలలో ఉచితంగా శిక్షణ ఇవ్వబడును అని శిక్షణ కాలం మూడు నెలలు ఉంటుందని శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచితంగానే భోజన సౌకర్యం హాస్టల్ సౌకర్యం ఉంటుందని ఆయన తెలిపారు.