రాజకీయాల్లో యువతదే కీలక పాత్ర - పి. ఏ. సి. ఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, -మండలం యూత్ ఇంచా

Published: Thursday November 10, 2022

బూర్గంపాడు (ప్రజా పాలన.)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని మోతె పట్టినగర్  లోజరిగిన  మండల యూత్ కమిటీ సమావేశం లో  రాజకీయాల్లో , ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువకుల కీలకపాత్ర పోషించాలని సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు అన్నారు... టీఆర్‌ఎస్‌ పార్టీ బూర్గంపహాడ్ మండల యువజన అధ్యక్షుడు గోనెల నాని అద్యక్షతన మోతె పట్టి నగర్ లో జరిగిన మండల యూత్‌ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని గోనెల నాని మాట్లాడుతూ...భవిష్యత్ రోజుల్లో రాజకీయాల్లో యువకులు అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రచారం చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు  పినపాక నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్దిని అందరికి తెలిసేలా  గ్రామాల్లో యువత భాధ్యత తీసుకోవాలన్నారు.  అదేవిధంగా గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలనన్నారు. ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకులను కలుపుకొని రాజకీయాలు చేయాలన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు వస్తాయన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పధకాలు అమలు చేస్తుందన్నారు. పినపాక నియోజకవర్గం అభివృద్ది కేవలం ఎమ్మెల్యే రేగా కాంతారావు తోనే సాధ్యమన్నారు. సందర్భంగా మండల యూత్ ఇన్చార్జ్ హర్ష నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దమ్మున్న లీడర్ రేగా కాంతారావు అని, వచ్చే ఎన్నికల్లో కాంతరావు ని అత్యధికమైన మెజారిటీతో గెలిపించి మంత్రి స్థానంలో నిలవాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్నుకున్న  గ్రామ కమిటీ లో  అధ్యక్షులు గా శనగ సర్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా, ఎనపల్లి సూర్య తేజ,ను వైస్ ప్రెసిడెంట్ లు గా బురం రాజు, బొడ ప్రసాద్, కర్నాటి దుర్గ ప్రసాద్, జనరల్ సెక్రటరీ గా చల్లా సంతోష్, ను గ్రామ యువత మొత్తం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమం లో సొసైటీ చైర్మన్ బిక్క సాని శ్రీనివాస రావు, మండల యూత్ అద్యక్షులు గోనెల నాని, ప్రధాన కార్యదర్శి యడమకంటి సుధాకర రెడ్డి, నియోజక వర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణ చంద్ర రావు, మండల వైస్ ప్రెసిడెంట్ లు భగవాన్ రెడ్డి, జై చంద్ర, సారపక యూత్ ప్రెసిడెంట్ లక్ష్మీ చైతన్య రెడ్డి, మోతె పట్టి నగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు గుదె వెంకట నరసయ్య, మండల విద్యార్థి విభాగం అధ్యక్షులు బండారి వంశీ,మండల ప్రచార కార్యదర్శి తోకల సతీష్, మండల యువజన నాయకులు కాధర్ మండల నాయకులు కోట రమేష్, మందా ప్రసాద్, సుధాకర్,పవన్, గ్రామస్తులు శ్రీహరి, సీతారాములు, నరసింహా రావు, సీతయ్య, రాంబాబు,శ్రీను, తదితరులు పాల్గొన్నారు....