*మిషన్ భగీరథ కార్మికుల వేతనాలు చెలించి, పేట్రోల్ చార్జీలు ఇవ్వాలి*

Published: Wednesday December 28, 2022

-12 గంటల డ్యూటీ సమయాన్ని 8 గంటలకు తగ్గించాలి.
సిఐటియు రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్*

చేవెళ్ల డిసెంబర్ 27, (ప్రజాపాలన):-

చేవెళ్ల మండల కేంద్రంలో మిషన్ భగీరథ డి ఈ కార్యాలయం ముందు  మిషన్ భగీరథ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి అల్లి  దేవేందర్ మాట్లాడుతూ మిషన్ భగీరథ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని గతంలో ఎన్సిసి యాజమాన్యం ఇచ్చిన విధంగా పెట్రోల్ చార్జీలు ఇవ్వాలని సేఫ్టీ పరికరాలు  కల్పించాలని అన్నారు. కార్మికిలకు  12 గంటల డ్యూటీ సమయాన్ని ఎనిమిది గంటలకు తగ్గించాలని నెలలో నాలుగు వారాంతపు సెలవులు ఇవ్వాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
మిషన్ భగీరథ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వకుండా ఎన్సిసి, లియోస్  యాజమాన్యాలు ఉన్న మిషన్ భగీరథ ప్రభుత్వ అధికారులు అయినా ఏ ఈ, డి ఈ, అధికారులు కాంట్రాక్టు యాజమాన్యాలకు నోటీసులు ఇవ్వకుండా వారితో కుమ్మక్కై మిషన్ భగీరథ కార్మికుల పొట్టగొడుతున్నారని అన్నారు.వెంటనే మిషన్ భగీరథ ప్రభుత్వ అధికారులు కాంట్రాక్టు యాజమాన్యాలు స్పందించి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాట నిర్వహిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఉద్యోగులు పాల్గొన్నారు.