స్వగ్రామం అయిన అంతర్గం అభివృద్ధి

Published: Tuesday August 10, 2021
పనులలో ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల, ఆగస్టు 09 (ప్రజాపాలన ప్రతినిధి): జిల్లాలోని అంతర్గం గ్రామంలో గ్రామ పంచాయతీ నిధులతో 3 సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేసి అనంతరం నూతనంగా నిర్మించే డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి స్థల పరిశీలన చేసి, అంతర్గం, చలిగల్, మోరపల్లి, తాటిపల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిది ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జడ్పీ చైర్మన్ దావా వసంత, లైబ్రరీ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్ అందజేసినారు. జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత స్వగ్రామంలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేయటం ఆనందంగా ఉందని, గ్రామాల్లో పల్లె ప్రకృతి, డంపింగ్, వైకుంటాదామాలు, హరితహారం లాంటి గొప్ప కార్యక్రమాలు ముఖ్యమంత్రి ఆశయానికి నిదర్శనమని అన్నారు. కవితక్క దత్తత తీసుకొని 100 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేశారని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యము వలన కొంత ఆలస్యం అయిందని, ఇప్పుడు నిర్మాణం జరుగుతుందని ఇంకా 24 ఇండ్లకు స్థల పరిశీలన చేశామని అలాగె పాఠశాల కాంపౌండ్, డ్రైనేజికి నిధులు కేటాయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోనగిరి నారాయణ, ఎంపీపీ రాజేంద్రప్రసాద్, ఎఎంసి చైర్మన్ దామోదర్ రావు, పిఎసిఎస్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్, ఉప సర్పంచ్ నోముల శేఖర్ రెడ్డి, సర్పంచులు చెరుకు జాన్, నడెం రత్నమాల శంకర్, ఎల్లా గంగానర్సు రాజన్న, ఉప సర్పంచ్ గణేష్, ఎంపీడీఓ రాజేశ్వరి, ఎంపీవో శ్రీనివాస్, నాయకులు కొట్టాల మల్లేశం, సురేష్, స్వామి రెడ్డి, గంగరాజం, ధర్మయ్య, రాజిరెడ్డి, సాయి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.