అసెంబ్లీ లో తీర్మానం చేయాలి: కాంగ్రెస్

Published: Wednesday February 09, 2022
బెల్లంపల్లి, ఫిబ్రవరి 8, ప్రజాపాలన ప్రతినిధి : సింగరేణి కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం, సూరి బాబు, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి గెల్లి జయరాం, మాట్లాడుతూ 8 సంవత్సరాలు అధికారం లో వున్నా తెరాస పార్టీ ఏనాడూ సింగరేణి అభివృద్ధి కొరకు కానీ, కార్మిక వర్గం కోసం కానీ మాట్లాడిన పాపానా పోలేదని విమర్శించారు. 8 సంవత్సరాల నుండి లేని ప్రేమ ఈనాడు సింగరేణి కార్మికులపై రావడం కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తప్ప మరొకటి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్తమారి సూరిబాబు టి పి సి సి కార్యదర్శి, గెల్లి జయరాం యాదవ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్జల్ బెల్లంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ముచ్చర్ల మల్లయ్య యాదవ్, బెల్లంపల్లి టౌన్ మాజీ అధ్యక్షులు. సిలువెరి సత్యనారాయణ, మంతెన కొమురయ్య, మేకల శ్రీనివాస్, బర్రె మధునయ్య, దాసరి ప్రతాప్, దేవసాని ఆనంద్, మహమ్మద్ గౌస్, తదితరులు పాల్గొన్నారు.