జాతీయ కరాటే చాంపియన్స్ కి ఎంపికైన ఇద్దరికీ ఆర్థిక సాయం అందించిన ఇంటూరి శేఖర్

Published: Thursday June 16, 2022
పాలేరు జూన్ 15 ప్రజా పాలన ప్రతినిధి
ఖమ్మం‌ జిల్లా కూసుమంచి మండలం  నాయకన్ గూడెం గ్రామానికి చెందిన ఎళ్లిమళ్ల టీనా, బొల్లెద్దు హారిక  మలేషియా లోని కౌలాలంపూర్ లో జరగనున్న ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ కు ఎంపికయ్యారు. టోర్నీకి వెళ్లేందుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ విషయన్ని నాయకన్ గూడేం గ్రామ సర్పంచ్ కాసాని సైదులు, ద్వారా ఖమ్మం డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ దృష్టికి తీసుకెళ్లాగా. వెంటనే స్పందించిన ఇంటూరి శేఖర్, ఇద్దరికి చెరొక ఐదువేలు రూపాయల ఆర్థిక సాయం అందజేశారు . ఈ యెక్క ఆర్థిక సహయం అందజేసిన ఇంటూరి శేఖర్, కి గ్రామ సర్పంచ్ కాసాని సైదులు,కి విద్యార్థిని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు .