సాత్వికను దీవించిన తుమ్మలపల్లి రమేష్

Published: Friday October 28, 2022
తల్లాడ, అక్టోబర్ 27 (ప్రజా పాలన న్యూస్):
  తల్లాడ మండలం నరసింహారావుపేట గ్రామంలో శనక్కాయల మోహన్ రావు - నాగమణి దంపతుల కుమార్తె చిరంజీవి సాత్వికకు ఓణీల అలంకరణ* వేడుక, కుమారుడు ఉపేందర్ కు పంచ కట్టు వేడుక వారి స్వగృహం నరసింహారావుపేట గ్రామంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు టిఆర్ఎస్ తల్లాడ మండల నాయకులు తుమ్మలపల్లి రమేష్, గోపాలపేట గ్రామ సర్పంచ్ నల్లమోతు మోహన్ రావు హాజరై చిన్నారులకు అక్షింతలు వేసి దీవించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలవాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  స్థానిక నాయకులు ఉన్నారు.