అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్న నిందితులను కఠినంగా శిక్షిస్తేనే తిరిగి పునరావృత్తం

Published: Thursday November 03, 2022
మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి కాసర్ల యాదగిరి
 
బెల్లంపల్లి నవంబర్ 2 ప్రజా పాలన ప్రతినిధి: దేశంలోనూ, రాష్ట్రంలోనూ, అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్న నిందితులను, కఠినంగా శిక్షించక పోవడం వల్లనే తిరిగి సంఘటనలు పునరావృత్తం, అవుతున్నాయని, అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి అన్నారు.
 
బుధవారం ఆయన మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా, తొర్రూరు మండలంలోని రేవులపల్లి గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇటీవల ధ్వంసం చేసిన సంఘటన మూర్ఖత్వమని, ఇలాంటి చర్యలు పునరావృత్తం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు.
రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పోలీసులచే  రక్షణ కల్పించాలని, డిమాండ్ చేశారు.
అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని 48 గంటల్లో అరెస్టు చేసి చట్టపరంగా, శిక్షలు అమలు చేయాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ఆయన హెచ్చరించారు.