నేడు ఎకెఆర్ స్టడీ సర్కిల్లో తెలంగాణ సంస్కృతి పై ఉచిత అవగాహన సదస్సు : ప్రముఖ మోటివేటర్ డాక్టర

Published: Friday November 26, 2021
వికారాబాద్ బ్యూరో 25 నవంబర్ ప్రజాపాలన : 26 నవంబర్ 2021 శుక్రవారం ఎకెఆర్ స్టడీ సర్కిల్లో తెలంగాణ సంస్కృతి పై ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నామని ఎకెఆర్ స్టడీ సర్కిల్ వ్యవస్థాపకులు బివి రమణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాన్ స్టేబుల్, ఎస్ఐ, గ్రూపు ఫోర్త్, పంచాయతీ కార్యదర్శుల పోటీ పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశాలు పండుగలు, జాతరలు, పాటలు, సినిమాలు, కళలు, కళాకారులు, వంటలు, ఆటలపై నల్గొండకు చెందిన డాక్టర్ శ్రీనివాసచారిచే ఉచిత అవగాహన తరగతులు నిర్వహింతనున్నట్లు ఎకెఆర్ స్టడీ సర్కిల్ వ్యవస్థాపకులు బివి రమణ పేర్కొన్నారు. స్థానిక శివరాంనగర్ కాలనీలోని శ్రీ హనుమాన్ మందిర్ పక్కన గల ఎకెఆర్ స్టడీ సర్కిల్లో శుక్రవారం ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు ఉచిత అవగాహన సదస్సు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు 9441022571 ఫోన్ నంబర్ కు సంప్రదించాలని కోరారు.