ఎమ్మార్వో కు వినతి పత్రం సమర్పించిన బిజెపి నేతలు

Published: Saturday June 19, 2021
బాలపూర్, జూన్ 18, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ వచ్చి ఏడు సంవత్సరాలు గడుస్తున్న రేషన్ కార్డ్ ఇవ్వలేని ప్రభుత్వం, కొత్తగా అప్లై చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ . మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని  ఎమ్మార్వో కు వినతి బిజెపి నేతలు అందరూ శుక్రవారం నాడు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి పెద్దలు మాట్లాడుతూ.... భాజపా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తెలంగాణ ఏర్పడి... గడుస్తున్న 7 సంవత్సరాలు గా ఒక్క రేషన్ కార్డ్ కూడా పేదలకు ఇవ్వలేదని, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి అవకాశం కల్పించి వారికికూడ రేషన్ కార్డు ఇవ్వాలని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రలో ఆయుష్మాన్ భారత్ వెంటనే అమలు చేయాలని నిరసనతో డిమాండ్ చేస్తూ బాలాపూర్ మండలం ఎమ్మార్వో కు  వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో రంగా రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం మల్లారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మద్ది రాజశేఖర్ రెడ్డి, జిల్లా St మోర్చ ప్రధాన కార్యదర్శి మోతీలాల్ నాయక్, బిజెపి ఫ్లోర్ లీడర్ తోట శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దడిగే శంకర్, కార్పొరేషన్ కార్పొరేటర్లు నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, గౌర రమాదేవి శ్రీనివాస్, ఇంద్రసేన, జనిగే పద్మఐలయ్య యాదవ్, రామిడి మాధురి వీరకర్ణా రెడ్డి, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి దొడ్డి మల్లికార్జున్, కళ్లెం లక్ష్మా రెడ్డి, సంపత్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, నగేష్, దొడ్డి శ్రీశైలం, శ్రీనివాస్ నాయక్, మంగపతి నాయక్, యువ మోర్చ ప్రధానకార్యదర్శి ఛత్రపల్లి అనిల్, బిజెపి నాయకులు అభిమానులు తదితరులు భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు.