కంటిమీద కునుకు లేదు కరెంటు కష్టాలు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యుత్ కోతకు అంతర

Published: Tuesday August 30, 2022
బోనకల్,, ఆగస్టు 29 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలోని కరెంటు కోతలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు వానలు మరోవైపు ఎండల వల్ల గ్రామీణ ప్రజలకు కంటి మీద కునుకు కరువవుతుంది. పగలు రాత్రి అనక విద్యుత్ కోతలతో మండల ప్రజలు సతమతమవుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట కరెంటు కోతలతో దోమల బెడద ఎక్కువగా ఉండి చిన్నపిల్లలు నిద్ర పోలేని పరిస్థితి ఉక్కపోతతో అల్లాడుతున్నారు. విద్యుత్ కోతలతో దోమలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్న విద్యుత్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. మండల సబ్ స్టేషన్ ఏ ఈ. ఏ డి. విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడం లేదని అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా దున్నపోతు మీద వాన కురిసే పరిస్థితి సామెత లాగ ఉంది. ఈ అధికారుల వలన బోనకల్ మండల 23 గ్రామ పంచాయతీలకు  విద్యుత్ తీవ్ర అంతరాయం ప్రతి రోజు జరుగుతుంది. అయినప్పటికీ కూడా శాశ్వత పరిష్కారాన్ని ఏ ఒక్క రోజు ఏ అధికారి కూడా సమస్యపై దృష్టి సారించ లేదు. అందుకే తీవ్ర విద్యుత్ అంతరాయం జరుగుతుందని మండల  ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతున్న అధికారులు మాత్రం మాకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా విద్యుత్ స్తంభాలపై ఉన్న సమస్యలను ఈరోజు వరకు పట్టించుకోకపోవడం వల్లే విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం జరుగుతుందని మండల ప్రజలు తెలుపుతున్నారు. నాణ్యమైన విద్యుత్తు సరపర మండలంలోని గ్రామాలకు  చేరకపోవడంతో అధికారుల నిర్లక్ష్య మండల ప్రజలకు శాపం లాగా మారింది. మండలంలోని విద్యుత్ అధికారులు పని చేస్తున్నారా లేదా అంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  ఇంతవరకు మార్గదర్శకాలు ఎంపిక చేయకపోవడం వల్లే  విద్యుత్ సరఫరా అంతరాయం జరుగుతుందని మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు నాయకులు తెలుపుతున్నారు. మండలంలోని  గ్రామాలకు నిరంతరం విద్యుత్ అంతరాయం కారణానికి  మండల  విద్యుత్ అధికారులు  ప్రధాన కారణమని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏ ఒక్క రోజు కూడా పురాతన లైన్లు గురించి ఆలోచించే ప్రసక్తి లేదని వాటిపై విద్యుత్ సరఫరా చేయడం వల్లే తీవ్ర విద్యుత్  అంతరాయం జరుగుతుందని, ఈ అధికారులకు స్థానిక నాయకులు ఎన్ని చెప్పినా  వారు నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ విద్యుత్ కోతలు జరుగుతున్నాయని అంటున్నారు.కావున జిల్లా విద్యుత్ ఉన్నత అధికారులు ఈ సమస్యపై దృష్టిసారించి త్వరితగతిన మండలంలోని విద్యుత్  సమస్య పరిష్కారం ఇస్తారని  మండల ప్రజలు కోరుతున్నారు.
 
 
 
Attachments area