ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 15 ప్రజాపాలన ప్రతినిధి *సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ ను కలిస

Published: Wednesday November 16, 2022

అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో తొలగించిన గుడిసె వాసులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నాయిబ్ తాసిల్దార్ కి మేమురండం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య , ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ, 40 రోజులుగా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న నిరుపేదల్ని, రెవిన్యూ అధికారులు, పోలీసు బలగాలతో నిర్బంధంగా లీడర్లని అరెస్టు చేసి మహిళలు అని కూడా చూడకుండా లాఠీ ఛార్జ్ చేసి గుడిసెలు తొలగించడానికి సరి అయినది కాదని అన్నారు. గుడిసెలు  తొలగించడానికి, స్థానిక ఎమ్మెల్యే ప్రధాన కారణమని, ఈ మండలంలో ప్రభుత్వ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కబ్జా చేసి అమ్ముకుంటున్న వారి పైన కేసులు పెట్టని అధికారులు. 60 గజాల కోసం తలదాచుకోవడానికి కుర్చీలు వేసుకుంటే గుడిసెలు తీసివేసి కేసులు పెడుతున్నారు.
ఎన్నిసార్లు గుడిసెలు కూడా తీసిన అన్నిసార్లు గుడిసెలు వేస్తూనే ఉంటామని దానికి అర్హులైన పేదలందరి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఏర్పుల నరసింహ, మండల కమిటీ సభ్యులు గుండె శివ, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కనకయ్య, బీఎస్పీ జిల్లా నాయకులు చిత్రం కృష్ణ బిక్షపతి, చిర్ర శివ అనిత, లలిత, జీవిత, సౌజన్య, మైసమ్మ,, వసంత,, యాదయ్య, మండల కార్యాలయం ముందు ధర్నా చేసి అనంతరం భీమవరంలో ఇవ్వడం జరిగింది.