ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తున్న పట్టించుకోని అధికారులు

Published: Wednesday December 14, 2022
భూమిని కాపాడాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేసిన స్థానికులు
 
బెల్లంపల్లి డిసెంబర్ 13 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ శివారులో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని, పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేస్తూ వ్యాపారం చేస్తుంటే, స్థానిక రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం వల్ల కోట్లాది రూపాయల విలువచేసే భూములను కబ్జాదారులు దర్జాగా అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్నారని, వెంటనే జిల్లా కలెక్టర్ ఈ భూములపై విచారణ జరిపించి ప్రభుత్వ భూములను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
 
వివరాల్లోకి వెళితే పాత 68 గని వెనకాల, కన్నాల శివారులోని సర్వే నెంబర్ 60లో 55 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, అప్పటి ఎమ్మార్వో ప్రస్తుత ఆర్డీవో గా పనిచేస్తున్న శ్యామల దేవి మూడు లక్షల రూపాయలతో 2019 లో చుట్టూ  కంచ వేయించినప్పటికి కొందరు నిరుపేదలు గుడిసెలు వేసుకోగా  సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ వారికి నచ్చచెప్పి   బయటికి పంపించారని,
అప్పటినుండి ఇప్పటివరకు ఆ భూమి అలాగే ఉండగా ఇటీవల కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆ భూమిలో నుండి దాదాపు పది కోట్ల విలువ చేసే ఎనిమిది ఎకరాల భూమిని రాత్రికి రాత్రి, చదును చేసి బోరు కూడా వేయించారని, అయినా ప్రస్తుత ఎమ్మార్వో గాని, ఆర్డీవో గాని పట్టించుకోవడంలేదని, ఫలితంగా ఎంతో విలువైన ప్రభుత్వ భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారుల హస్త గతం అవుతుందని, కావున జిల్లా కలెక్టర్  ఈ సర్వే నెంబర్ 60 లో ఆక్రమించిన భూమిపై వెంటనే విచారణ జరిపించి రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి పోకుండా ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
 
ఇదిలా ఉండగా దాన్ని ఆనుకొని ఉన్న తిరుమల వెంచర్ లో  ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నట్లు  వివాదాస్పదం కాగా, రియల్ వ్యాపారులు స్థానిక అధికార పార్టీ ముఖ్యమైన ప్రజా ప్రతినిధులను మచ్చిక చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుండగా, కన్నాల గ్రామపంచాయతీ పాలకవర్గం, ఇటీవల తిరుమల వెంచర్ కి ఎలాంటి అనుమతులు లేవని, ఎవరూ ప్లాట్లు కొనకూడదని, ఫ్లెక్సీ లు కట్టి ప్రచారం చేయడం కోసమెరుపు.