సాగునీరు కాదు,త్రాగు నీరు, మాటమార్చిన కెసిఆర్* -పాలమూరు రంగారెడ్డి రైతుల నోట్లో మట్టి

Published: Monday February 20, 2023

-ప్రాజెక్టు డెజైన్  పర్యావరణం  దెబ్బతినెలా ఉందని,

-925 కోట్లు  జరిమానా విందించిన ఎన్జీటీ.

- చేవెళ్ల మాజీ ఎంపీ  కొందవిశ్వేర్ రెడ్డి.

చేవెళ్ల ఫిబ్రవరి 18,(ప్రజాపాలన):-

పాలమూరు రంగారెడ్డి  లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై మరోసారి మాట మార్చి, రైతుల నోట్లోమట్టి  కొట్టారని, మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.  చేవెళ్ల మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో  శనివారం పాత్రికేయులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుపై (ఎన్జీటీ) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్  ప్రాజెక్టు రీ డిజైన్ పర్యావరణానికి హానికలిగించే  విధంగా ఉందని,  ఈ డిజైన్ కు  అనుమతులు లేవని, ఎన్ జీ టీ  హైకోర్టు 925 కోట్లు జరిమానా విధించందని, అన్నారు.
ఐదు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న. పాలమూరు రంగారెడ్డి జిల్లాలలోని తాండూర్ వికారాబాద్ చేవెళ్ల  పరిగి పట్టణాల ప్రాంతాల  రైతులను మోసం చేశారని,  సుప్రీంకోర్టులో సాగునూరు ప్రాజెక్టు కాదని, తాగునీరు ప్రాజెక్టు అని మరో మారు కెసిఆర్ మాట మార్చి రైతులను మోసం చేశారని అన్నారు.  కార్యక్రమంలో చేవెళ్ల నియోజవర్గం ఇంచార్జ్ కంచర్ల  ప్రకాష్, చేవెళ్ల నియోజకవర్గం  కార్యదర్శి అత్తెల్లి  అనంతరెడ్డి, మండల  ఉపాధ్యక్షులు కేశపల్లి వెంకటరామిరెడ్డి,  జి వెంకటరెడ్డి, శేఖర్ రెడ్డి, అశోక్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు