విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలి

Published: Monday November 14, 2022
 పిడిఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మహేష్
వికారాబాద్ బ్యూరో 13 నవంబర్ ప్రజాపాలన : దేశంలో రాష్ట్రంలో విద్యావినాశనానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిని తిప్పికొట్టడానికి విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలి అని పిడిఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి మహేష్ అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంవిఆర్ గార్డెన్ లో పిడిఎస్ యు విద్యార్థి సంఘం  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా పిడిఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి మహేష్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యకాషాయీకరణకుపాల్పడుతుందని విమర్శించారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ముఖ్యమంత్రి విద్యావినాశనానికి  అనేక మార్పులు తీసుకొచ్చాడని తెలిపారు. ఈరోజు పేదవాళ్ళకు చదువుకోడానికే కష్టంగా మారిందని అన్నారు. విశ్వవిద్యాలయాలలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను ఇంకా భర్తీచేయకుండా ఉన్నత విద్యను నిర్లక్ష్యం చేసిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి చాలా దారుణంగా మారిందని జైల్లో ఖైదీల కంటే హీనంగా విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారని ఆరోపించారు. గత 6 సంవత్సరాలనుండి స్కాలర్షిప్స్, ఫీజురియాంబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్పారు. రాబోవు రోజుల్లో ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కారం చేయకపోతే పిడిఎస్ యు విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం అని హెచ్చరించారు. అనంతరం ఉమ్మడి రంగారెడ్డి శిడిఎస్ యు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.  అధ్యక్షులుగా శ్రీనివాస్, కార్యదర్శిగా రాజేష్, ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్, గోపాల్, దీపక్ ,సహాయ కార్యదర్శిగా ప్రభావతి, జైపాల్, కమిటీ సభ్యులుగా సురేష్, ప్రకాష్ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు నాయకులు  తదితరులు ఉన్నారు.