*గ్రామ పంచాయతీ కార్మికుల పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ

Published: Monday February 13, 2023
*జివో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి.
 
* సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్
 
లక్షేట్టిపేట్ , ఫిబ్రవరి 12, ప్రజాపాలన:
 
 గ్రామ పంచాయితీ  కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, జీతాలు  పెంచాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12న పాలకుర్తి నుంచి 17 రోజు లపాటు 300 కిలోమీటర్లు చేపట్టనున్న యాత్ర కు సంబంధించిన డోర్ పోస్టర్ లను ఆదివారం మండల కేంద్రంలోని ఐబీ విశ్రాంతి భవనం ఎదుట ఆవిష్కరిం చారు. ఈ సందర్బంగా సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ  పాలకుర్తి నుండి 17 రోజులపాటు 300 కిలోమీటర్లు  యాత్ర కొనసాగుతూ చివరి రోజైనా ఫిబ్రవరి 28వ తేదీన ఇందిరా పార్క్ వద్ద కు  చేరుతుందని తెలిపారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు.  రాష్ట్రంలో అన్ని రకాల కార్మికులకు పెంచినట్లుగా పిఆర్సి ప్రకారం వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.  ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబానికి 5 లక్షలా ఎస్కిడే ఇన్సూరెన్స్ అందించాలన్నారు. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దుచేసి,  కేటగిరీల వారిగానే పనులు చేయించాలని,. జిఓ 60 ప్రకారం పరిశుద్య   కార్మికులకు 15,600 వేతనం చెల్లించాలని,  కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలని అన్నారు.  పిఎఫ్ ఈఎస్ఐ , ప్రమాద బీమా సౌకర్యాలు అమలు చేయాలని, తదితర డిమాండ్ల సాధన కోసం   పాదయాత్ర ముగింపు రోజు ఇందిరాపార్క్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించినట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్షులు అవునూరి సాగర్,బేక్కం జగన్ కార్యదర్శి, బేడిగం ఆశయ్య ఉపాధ్యక్షులు,కలమడుగు పోచయ్య, సహాయ కార్యదర్శి,కోడి రాజయ్య కోశాధికారి,రేగుంట రవీందర్ సలహా దారులు,  భూమయ్య,దుర్గయ్య,లచ్చయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.