జిల్లా ఆసుపత్రిలో సిబ్బందిని, వైద్యాధికారులను నియమించాలి. ....మాతా శిశు ఆసుపత్రిని వినియోగంల

Published: Friday December 30, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 29 ప్రజా పాలన ప్రతినిధి: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యులను, ఇతర సిబ్బందిని , వెంటనే భర్తీ చేయాలని మాత శిశు ఆసుపత్రినీ వినియోగ వినియోగంలోకి  తీసుకురావాలని, స్కీం వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని, సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, టి, హరీష్ రావుకు గురువారం బెల్లంపల్లిలో వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
 గత వరదల కారణంగా మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రి నీట మునిగిపోయి ఆసుపత్రి అందుబాటులో లేకపోవడంతో జిల్లాలో ఉన్నటువంటి మారుమూల పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎంతో వ్యయ, ప్రయాసలకోర్చి, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారనీ.  ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ వర్కర్లకు సంబందించిన ఏజెన్సీలు ప్రభుత్వ జివో ప్రకారం వేతనాలు చెల్లించడం లేదనీ,  జిల్లాలోని ఆశా  వర్కర్స్ , అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్, మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులు ఎంత భారమైన పనులు చేసిన ప్రభుత్వం మాత్రం సమాన పనికి సమాన వేతనం చెల్లించకుండా, శ్రమ దోపిడీకి గురి చేస్తుందనీ అన్నారు. ఇప్పటికైనా మంత్రి స్పందించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
 ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల జిల్లా నాయకురాల్లు సమ్మక్క,శోభ , జిల్లా కమిటీ సభ్యులు లీల,  భాగ్యలక్ష్మి , ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు చిప్పకుర్తి కుమార్,  డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు చల్లూరి దేవదాస్  తదితరులు పాల్గొన్నారు.